- Advertisement -
లక్నో : చండీగఢ్ మేయర్ ఎన్నికలో రిటర్నింగ్ ఆఫీసర్ సాక్షిగా “రిగ్గింగ్ ” జరగడం, సుప్రీం కోర్టు విచారణలో బయల్పడడం పై సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. అధికార దాహంతో బీజేపీ ఎలా ఉందో దీన్ని బట్టి తెలుస్తుందని వ్యాఖ్యానించారు. దొంగదారి ద్వారా స్కామ్‌ల ద్వారా ఆ పార్టీ ప్రతీ ఎన్నికలో ఎలా గెలుస్తోందో ఆపార్టీ మద్దతుదారులు తెలుసుకోవాలని ఆయన చురకలంటించారు.
అలాంటి వారి చేతిలో దేశం కానీ , పిల్లల భవిష్యత్తు కానీ క్షేమంగా ఉండబోదని ఎద్దేవా చేశారు. ఈ చర్యకు బీజేపీ మద్దతుదారులు సిగ్గుతో తలవంచుకోవాలని , యావత్తు దేశానికి బీజేపీ క్షమాపణ చెప్పాలని, వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఒత్తిడితో ఎవరైతే అధికారులు ఇలాంటి నేరాలకు పాల్పడ్డారో, ఇప్పుడు గుణపాఠం నేర్చుకోవాలన్నారు.
- Advertisement -