- Advertisement -
లక్నో: సమాజ్‌వాది పార్టీ అధ్యక్షునిగా అఖిలేష్ యాదవ్ వరుసగా మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. ఇక్కడి రమాబాయి అంబేద్కర్ స్టేడియంలో గురువారం జరిగిన సమాజ్‌వాది జాతీయ ప్లీనరీలో అధ్యక్ష ఎన్నిక ఫలితాలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ ప్రకటించారు. అధ్యక్ష పదవికి అఖిలేష్ యాదవ్ ఒక్కరే అభ్యర్థని ఆయన తెలిపారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను తన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌ను స్వీకరిస్తూ 2017 జనవరిలో జరిగిన పార్టీ అత్యవసర సమావేశంలో సమాజ్‌వాది పార్టీ అధ్యక్షునిగా అఖిలేష్ యాదవ్ మొదటిసారి ఎన్నికయ్యారు. అదే ఏడాది అకోబర్‌లో జరిగిన పార్టీ జాతీయ ప్లీనరీలో ఆయన రెండవసారి పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
- Advertisement -