Sunday, December 22, 2024

మాకు 80 ఎంపి సీట్లు వచ్చిన ఇవిఎంలపై నమ్మకం లేదు: అఖిలేష్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: అయోధ్యలో ఎస్‌పి అభ్యర్థి గెలుపు శ్రీరాముడి తీర్పు అని ఎస్‌పి అధినేత, ఎంపి అఖిలేష్ యాదవ్ తెలిపారు. అయోధ్యంలో అసత్యంపై సత్యం గెలిచిందని, రామమందిరంపై బిజెపి రాజకీయాలు చేసి ఓడిపోయిందని ధ్వజమెత్తారు. పార్లమెంటు సమావేశాలు సందర్భంగా లోక్ సభలో అఖిలేష్ ప్రసంగించారు. గంగానదిని శుభ్రం చేయనందుకే ఉత్తర ప్రదేశ్ ఓటర్లు బిజెపికి బుద్ధి చెప్పారని, యుపిలో వర్షాలకు నగరాలన్నీ చెరువులుగా మారాయని, పదేళ్లలో యుపిలో బిజెపి ఎం అభివృద్ధి చేయలదేని, ఢిల్లీలాగా యుపిలో ఒక్క ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించలేదని, పిఎం మోడీ చేసి వాగ్ధానాలను మర్చిపోయారని అఖిలేష్ మండిపడ్డారు.

లోక్ సభ ఎన్నికలలో ఇండియా కూటమిదే నైతిక విజయమని, ఎన్‌డిఎ నడిచే ప్రభుత్వం కాదు అని, పడిపోయే ప్రభుత్వం అని, బిజెపి 400 సీట్ల ఎజెండా ఫెయిల్ అయ్యిందని చురకలంటించారు. ఆకలి, సంతోషం సూచిల్లో ఎక్కడున్నామో ముందు చూసుకోవాలని. ఆ తరువాత ట్రిలియన్ డాలర్ల ఎకానమీపై ఆలోచన చేయాలని సూచించారు. దేశంలో పంటకు మద్దతు ధర దక్కడం లేదని, ఎన్‌డిఎ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదలుచుకోలేదని, అందుకే పేపర్ల లీకులు జరుగుతున్నాయని అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవిఎంలు తొలగించేదాకా తమ పోరాటం ఆగదని, యుపిలో ఎస్‌పి  80 ఎంపి సీట్లు  గెలిచినా ఇవిఎంలపై నమ్మకం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News