Monday, December 23, 2024

యూపీ సీఎం పీఠం అఖిలేశ్ యాదవ్‌దే

- Advertisement -
- Advertisement -

Akhilesh Yadav is the UP CM:Latest survey

మరో మూడు సంస్థల తాజా సర్వే

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఈసారి అఖిలేశ్ యాదవ్ సారథ్యం లోని సమాజ్‌వాదీ అధికార పగ్గాలు చేపట్టబోతుందని మూడు సంస్థలు తమ సర్వేద్వారా వెల్లడించాయి. ఇప్పటికే అన్ని ప్రముఖ సర్వేలు బీజేపీదే మళ్లీ అధికారం అని వెల్లడించగా, వేరే మూడు సంస్థలు మాత్రం బీజేపీ భారీగా సీట్లను కోల్పోతుందని తేల్చి చెప్పాయి. పోలింగ్ ముగియగానే అన్ని సంస్థలూ ఎగ్జిట్ పోల్స్‌ను వెలువరించాయి. బీజేపీదే అధికారమని పేర్కొన్నాయి. కానీ 4 పీఎం, ది పాలిటిక్స్ డాట్ ఇన్‌తోపాటు దేశబంధు కూడా యూపీలో అఖిలేశ్‌దే అధికారమని ప్రకటించాయి.

సమాజ్‌వాదీకి 238 సీట్లు వస్తాయని ఈ సంస్థలు పేర్కొన్నాయి. బీజేపీ కేవలం 157 సీట్లలో మాత్రమే పాగా వేయనుందని తెలిపాయి. మాయావతి నేతృత్వం లోని బీఎస్పీకి 6 సీట్లు, కాంగ్రెస్‌కు ఒకే ఒక్క సీటు వస్తుందని వివరించాయి. దేశబంధు అనే సంస్థ సర్వే లోనూ అఖిలేశే సీఎం అవుతారని తేలింది. ఈ సర్వే ప్రకారం సమాజ్‌వాదీకి ఈసారి 228 నుంచి 244 సీట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తేల్చింది. ఇక బీజేపీకి 134 నుంచి 150 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని దేశబంధు తెలిపింది. ఇక కాంగ్రెస్‌కు 9, బీఎస్పీకి 10, ఇతరులకు 24 సీట్లు వస్తాయని దేశబంధు పేర్కొంది.

సోమవారం ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మిగతా నాలుగు రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా అందరి దృష్టీ ఉత్తరప్రదేశ్ పైనే పడింది. యూపీలో మళ్లీ కమలం పాగా వేస్తుందని, ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ అభ్యర్థియే కూర్చుంటారని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. అయితే గతంలోలా కాకుండా… ఈసారి భారీగా కోత పడే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా 300 పైచిలుకు సీట్లు కాకుండా 202 వరకూ వచ్చి ఆగిపోతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News