- Advertisement -
న్యూఢల్లీ: ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో సమాజ్ వాదీ పార్టీ నేత, యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత జాతీయ రాజకీయాలపై చర్చించారు. దాదాపు గంటన్నర నుంచి కొనసాగుతున్న ఈ సమావేశంలో దేశ రాజకీయాల్లో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు వాటిని ఎదుర్కోనేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలో అఖిలేష్ యాదవ్ తో పాటు ఎస్పీ ఎంపి రాంగోపాల్ యాదవ్ కుడా ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు.
- Advertisement -