Sunday, December 22, 2024

మా పార్టీ లోకి రండి… యోగీపై పోటీ చేయండి

- Advertisement -
- Advertisement -

Akhilesh Yadav offers nomination to BJP MLAs

గోరఖ్‌పుర్ సిట్టింగ్ ఎమ్‌ఎల్‌ఎకు ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ప్రతిపాదన

లఖ్‌నవూ: గోరఖ్‌పూర్ అర్బన్ ప్రస్తుత బిజెపి సిట్టింగ్ ఎంఎల్‌ఎ రాధామోహన్ దాస్ అగర్వాల్‌కు అవమానం జరిగిందని , ఆయనకు ఆసక్తి ఉంటే తమ పార్టీలో చేరొచ్చని టికెట్ కూడా కేటాయిస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఓ వినూత్న ప్రతిపాదనతో ముందుకు రావడం రాజకీయంగా కొత్త ఎత్తుగడలకు తెరలేపుతోంది. యోగీపై పోటీ చేయించడానికి ఈమేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నియోజక వర్గం నుంచే యోగి బిజెపి తరఫున పోటీ చేయనున్నారు. ఇటీవల బిజెపి నుంచి ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఎంఎల్‌ఎలు ఎస్పీలో చేరారు. దీంతో ఇక ఆ పార్టీ నుంచి ఎవరొచ్చినా తీసుకోబోమని అఖిలేష్ యాదవ్ చెప్పారు. అయితే రాధామోహన్ విషయంలో మాత్రం సడలింపు వైఖరి అవలంబిస్తామన్నారు. ఆయన తమ పార్టీలో చేరతానంటే గోరఖ్‌పుర్ అభ్యర్ధిగా ప్రకటిస్తామని చెప్పారు. 2002 నుంచి రాధామోహన్ గోరఖ్‌పుర్ అర్బన్ సిట్టింగ్ ఎంఎల్‌ఎగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News