Sunday, February 16, 2025

కుంభమేళాపై ప్రభుత్వానికి అఖిలేశ్ విజ్ఞప్తి

- Advertisement -
- Advertisement -

ప్రయాగ్‌రాజ్: మహాకుంభమేళ ముగింపు దశకు చేరుకుంది. జనవరి 13వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం గడువు ముగిసేలోపు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు పోటెత్తుతున్నారు. ఇప్పటికే దాదాపు 50 కోట్ల మంది పవిత్రస్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. మరో 11 రోజుల్లో ఈ కార్యక్రమం ముగుస్తుండటంతో భక్తుల తాకిడి మరింత పెరుగుతోంది. ఇప్పటికే రికార్డుస్థాయిలో 300కి.మీ మేర ట్రాఫిక్‌ జామ్ అయిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ కుంభమేళ గురించి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అభిలేశ్ యాదవ్ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. కుంభవేళకు వచ్చే భక్తుల సంఖ్య ఇంకా కోట్లల్లో ఉన్న కారణంగా కుంభవేళ గడువు పెంచాలని ఆయన కోరారు. ‘ఇప్పటికూడా చాలామంది మహాకుంభమేళలో పాల్గొనాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాళ్ల కోసం ప్రభుత్వం కుంభమేళ గడువును పెంచాలి’ అని అఖిలేశ్ అన్నారు. ప్రస్తుతం కుంభమేళ నిర్వహిస్తున్న సమయం చాలా తక్కువగా ఉందని.. గతంలో 75 రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News