సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యాలయంలో సమర్పించారు. అఖిలేష్ తోపాటు అవధేష్ ప్రసాద్ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కర్హల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన అఖిలేష్.. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో ఆయన ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకుని.. అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అవధేష్ ప్రసాద్ కూడా.. ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు.
లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ ఇండియా కూటమి.. ఉత్తరప్రదేశ్‌లోని 80 సీట్లలో 43 స్థానాలను గెలుచుకుని లోక్‌సభలో మూడవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 6 సీట్లు గెలుచుకుంది. ఎస్పీ 62, కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేశాయి.