Saturday, November 9, 2024

మైన్‌పురి బరిలో అఖిలేశ్ భార్య డింపుల్

- Advertisement -
- Advertisement -

లక్నో : ఉత్తర ప్రదేశ్ నుంచి లోక్‌సభకు తాము పోటీ చేసే స్థానాలలో 16 స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ‘ఇండియా’ కూటమిలో తమ భాగస్వామ్య పక్షం కాంగ్రెస్‌కు ఎస్‌పి 11 సీట్లు ప్రత్యేకించినట్లు పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలియజేసిన మరునాడు ఈ ప్రకటన వెలువడింది. అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్ మైన్‌పురి బరిలో నిలుస్తుండగా సంభాల్ నుంచి షఫీకుర్ రెహ్మాన్ బర్క్, లక్నో నుంచి రవిదాస్ మెహ్రోత్రా పోటీ చేయనున్నారు.

‘ఇండియా’ కూటమిలో సీట్ల పంపిణీ చర్చలకు విఘాతం కలుగుతున్న సమయంలో మంగళవారం సమాజ్‌వాది పార్టీ నుంచి ఈ ప్రకటన రావడం ఆశ్చర్యం కలిగించింది. సమాజ్‌వాది పార్టీ మొదటి జాబితాలో 11 మంది ఒబిసిలు, ఒక ముస్లిం, ఒక దళితుడు, ఒక ఠాకూర్, ఒక టాండన్, ఒక ఖత్రి అభ్యర్థి ఉన్నారు. 11 మంది ఒబిసి అభ్యర్థులలో నలుగురు కుర్మి, ముగ్గురు యాదవ్, ఇద్దరు శాక్య అభ్యర్థులు, ఒక నిషద్ అభ్యర్థి, ఒక పాల్ అభ్యర్థి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News