Monday, December 23, 2024

రెండు స్థానాల నుంచి అఖిలేశ్ యాదవ్ పోటీ?

- Advertisement -
- Advertisement -

Akhilesh Yadav will contest in UP Elections 2022

లక్నో: సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎన్నికల బరిలో దిగుతారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇంతకు పూర్వం తాను ఎన్నికల పోటీ లోకి దిగడం లేదని, అభ్యర్థులందరికీ మార్గనిర్దేశనం మాత్రమే చేస్తుంటానని ప్రకటించారు. తాజాగా ఇదే విషయమై బుధవారం పాత్రికేయులు అడగ్గా అజంఘర్ ప్రజలను అడిగి చెబుతానన్నారు. ఎన్నికల గోదా లోకి దిగాలనుకుంటే అజంఘర్ ప్రజల నుంచి తాను అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఎందుకంటే ఆ ప్రజలే తనను ఎన్నుకున్నారని చెప్పారు. అయితే మరో వర్గం మాత్రం ఆయన వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నందున అజంఘర్, మైన్‌పురీ స్థానాల నుంచి పోటీకీ దిగుతారని చెబుతున్నారు. అజంఘర్ నుంచి పోటీకి దిగడం ద్వారా పూర్వాంచల్ పై పట్టు సాధించడానికి వీలవుతుందని, ఇక మైన్‌పురీ నుంచి పోటీ చేస్తే ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజక వర్గాన్ని కాపాడుకున్నట్టు ఉంటుందన్నది అఖిలేశ్ వ్యూహకర్తల మాటగా చెబుతున్నారు.

Akhilesh Yadav will contest in UP Elections 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News