Monday, December 23, 2024

ములాయం ఇలాకాలో బరిలోకి డింపుల్..

- Advertisement -
- Advertisement -

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సిఎం ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. దీంతో ఈ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుంచి అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారికంగా ఈ సమాచారాన్ని ట్విటర్‌లో ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న ఉప ఎన్నిక జరగనుంది. వీటితో పాటే ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్‌పురి పార్లమెంట్ స్థానానికి ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక ఫలితాలు, డిసెంబర్ 8వ తేదీన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటే ప్రకటిస్తారు.

Akhilesh Yadav’s Wife Dimple to contest in Lok Sabha bypoll

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News