Friday, December 20, 2024

కెసిఆర్ తో ముగిసిన అఖిలేశ్ భేటీ…

- Advertisement -
- Advertisement -

Akhilesh's meeting with KCR ended

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సమావేశం ముగిసింది. ఢిల్లీలోని సిఎం కెసిఆర్ అధికారిక నివాసంలో వారి భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు జాతీయ అంశాల పై ఇరువురు నేతలు  రెండు గంటలకు పైగా చర్చించారు. ఇటీవల జరిగిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడారు. సాయంత్రం 5గంటలకు ఢిల్లీలో పలు ప్రదేశాలను కెసిఆర్ సందర్శించనున్నారు. ఢిల్లీలో మొహల్లా క్లినిక్, స్థానిక స్కూళ్లను సిఎం పరిశీలించనున్నారు. కెసిఆర్ తో పాటు స్కూళ్ల సందర్శనకు ఢిల్లీ ముఖ్యమత్రి కేజ్రీవాల్ వెళ్లనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News