టీవీ యాంకర్ టర్న్‌డ్ హీరో ప్రదీప్ మాచిరాజు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు యంగ్ టాలెంటెండ్ డైరెక్టర్స్ నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. శుక్రవారం మేకర్స్ థర్డ్ సింగిల్ మొదటి చినుకు సాంగ్ రిలీజ్ చేశారు.
రధన్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ మెలోడీ అద్భుతమైన గ్రామీణ నేపథ్యంలో తొలి ప్రేమలోని అమాయకత్వం, మ్యాజిక్‌ను అందంగా చిత్రీకరిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రాసిన సాహిత్యం అద్భుతంగా వుంది. సిద్ శ్రీరామ్ తన మైమరపించే గాత్రంతో ట్రాక్ ని నెక్స్ లెవెల్ కి తీసుకెళ్ళారు. ఈ పాట ప్రదీప్, దీపికల కెమిస్ట్రీ, ఆన్-స్క్రీన్ ప్రేమకథను అద్భుతంగా చూపించింది. కొరియోగ్రాఫర్ విశ్వ రఘు వారి ప్రేమకథను బ్యూటీఫుల్ డ్యాన్స్ మూమెంట్స్‌తో చిత్రీకరించారు. ప్రదీప్ తొలి చిత్రం లాగానే, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి విడుదలకు ముందే మ్యూజికల్ హిట్‌గా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు.