Sunday, December 22, 2024

అమ్మవార్లకు అక్కన్నమాదన్న పట్టువస్త్రాలు

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట : పాతబస్తీ హరిబౌలిలోని చారిత్ర శ్రీ అక్కన్నమాదన్న మహంకాళి దేవాలయ వజ్రోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం గౌలిపురా శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత, కోటమైసమ్మ దేవాలయం, సుల్తాన్‌షాహి శ్రీ జగదాంబ రేణుక ఎల్లమ్మ దేవాలయం, గౌలిపురా రాంసింగ్‌బాడ శ్రీ బంగారుమైసమ్మ దేవాలయాలలో పట్టువస్త్రాలు అందజేశారు.

ఆలయ కమిటి సభ్యులు జోగిందర్ సింగ్, అమ్మవారి భక్తులు పెద్దోజు రవీంద్రాచారి, పి.మహేష్ తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవాయిద్యాలతో ఆలయాలకు చేరుకున్నారు. ఆలయంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయా ఆలయాల అధ్యక్షులు ఎర్మని కైలాష్ గంగపుత్ర తదితరులు వారికి ఘన స్వాగతం పలికారు. శాలువతో ఘనంగా సన్మానించి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అక్కన్నమాదన్న ఆలయ అధ్యక్షులు రాందేవ్ అగర్వాల్, కార్యదర్శి కె.దత్తాత్రేయ, కోశాధికారి ఎ.సతీష్ ప్రతినిధులు జి.రాజరత్నం, డాక్టర్ ఆవుల భరత్ ప్రకాష్, ఎస్.పి.క్రాంతి కుమార్, జగ్మోహన్ కపూర్, పి.మహేష్, ఎ.రజత్, ఎల్.అరుణ్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News