Friday, November 22, 2024

అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ‘అక్కన్నపేట’

- Advertisement -
- Advertisement -
  • త్వరలో గొప్ప మండలంగా తీర్చిదిద్దుతాం..!
  • గ్రామగ్రామాన అన్ని విధాలుగా అభివృద్దే లక్ష్యం
  • హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

అక్కన్నపేట: ప్రతి గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి జరిగి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సోమవారం అక్కన్నపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిపి మాలోతు లక్ష్మీ బీలు నాయక్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం సంక్షేమ ఫలాలు ప్రతి గడపగడపకు అందే ఉద్దేశంతోనే సిఎం కెసిఆర్ నూతన జిల్లాలు, మండలాలను నెలకొల్పారని తద్వారా అధికార వికేంద్రీకరణ జరిగి పరిపాలన సులభతరమయ్యేందుకే హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏర్పడిన నూతన మండలం అక్కన్నపేట ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు.

మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందించే బృహత్తరమైన గౌరవెల్లి ప్రాజెక్టును కూడా ఈ మండలంలోనే ఉందని త్వరలోనే సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభిస్తామని గుర్తు చే శారు. ఇంటిగ్రేటెడ్ ఆఫీసు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయిం చ డం జరిగిందని త్వరలోనే నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. అలాగే మండ లం లోని అంతక పేట గ్రామంలో వ్యవసాయ సబ్ మార్కెట్ కోసం 9.20 ఎక రాలు కేటాయించడం జరిగిందని పనులు కూడా ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు.

తరుగు పేరిట మిల్లర్ల నిలువు దోపిడీ

రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో ఔటింగ్ పేరుతో అవకతవకలు జరిగాయని అధిక తూకం తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడి, చేస్తున్నారని, అధికారులు బ్రోకర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేయడానికి ఒడికట్టారని మండిపడ్డారు. సుతీలు దారం విషయంలో విషయం తెలిసినప్పటికీ కూడా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుండా ఏమి చేస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు.

పర్మినెంట్ వ్యవసాయ అధికారిని వెంటనే నియమించాలి

ఇంచార్జి వ్యవసాయ అధికారిగా భోగేశ్వరస్వామి విధులు నిర్వహిస్తున్నారని ఆయన కనీసం మండలం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని రైతులు గాని ప్రజాప్రతినిధులు గాని ఫోను చేసినా కూడా స్పందించడం లేదని ఆయన పనితీరుపై అక్కన్నపేట సర్పంచి ముత్యాల సంజీవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న రకం విత్తనాలు పెట్టడం వల్ల ఔటింగ్ రాక రైతులకు చాలా నష్టం జరిగిందని సన్న రకం సీడును తనిఖీలు నిర్వహించి బ్యాన్ చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పర్మినెంట్ వ్యవసాయ అధికారిని వెంటనే నియమించాలని ఎమ్మెల్యేకు తెలుపగా వెంటనే జిల్లా అధికారికి ఫోన్ చేసి మాట్లాడారు. రైతులకు సీజన్ ప్రారంభించక ముందే ఎలాంటి రకమైన సీడ్ పెట్టాలని పెట్టడం ద్వారా లాభాలు ఏ విధంగా ఉంటాయో అని అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు.అలాగే మండల కేంద్రంలో 24 గంటల వైద్య సదుపాయాలు కల్పించి మండల ప్రజలకు ఇబ్బందులు కలవకుండా చూసుకోవాలని వైద్యాధికారులకు తెలిపారు.

టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్‌కు రావట్లేదు

ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఇంకుడు గుంతలు నిర్మించినప్పటికీ కూడా ఇంతవరకు బిల్లులు రాలేదని టెక్నికల్ అసిస్టెంట్ వినోద్ ఫీల్డ్‌కు కూడా రావడం లేదని ఆయన పనితీరుపై మండిపడ్డారు. ఎంపీడీవో వెంటనే చర్యలు తీసుకొని బిల్లులు వచ్చే విధంగా చూడాలన్నారు. గొర్ల షెడ్లకు తీర్మానం ఇచ్చిన ఇప్పటికే కూడా ఎస్టిమేషన్ వేయడం లేదని వెంటనే ఎస్టిమేషన్ వేసి గొర్ల షెడ్లు కట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చౌటపల్లి సర్పంచ్ గద్దల రమేష్ అన్నారు. చౌటపల్లి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ రైతుల వద్ద 20 రూపాయలు వ సూలు చేస్తున్నారని 20 రూపాయలు దేనికోసం వసూలు చేశారని వెంటనే ఏపిఓ ఫీల్డ్ మీదికి దాని మతలాబెంటో తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పిటిసి భూక్యా మంగా శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన ర జిని, తహశీల్దార్ సంజీవ్ కుమార్, ఎంపిడిఓ సత్యపాల్ రెడ్డి లతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News