Thursday, January 23, 2025

అక్కెనపల్లి రైతుబంధు సమితి అధ్యక్షుడు మృతి

- Advertisement -
- Advertisement -

నంగునూరు: నంగునూరు మండలంలోని అక్కెనపల్లి రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు జగ్గని రామచంద్రం శుక్రవారం రోజున రాత్రి మృతి చెందాడు. రామచంద్రం గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రోజున మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా సేవలు అందించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలోను రామచంద్రంగా చాలా చురుగ్గా పాల్గొని పార్టీ కార్యకర్తలను మమేకం చేస్తు పార్టీ ప్రతి కార్యక్రమానికి చురుగ్గా పాల్గొన్నాడు.

గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రామచంద్రం శుక్రవారం రోజున గుండె పోటుతో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామంలో, మండలంలో జరిగే ప్రతి కార్యక్రమాని హాజరై అందరితో కలుపుగోలుగా ఉండే రామచంద్రం మృతి పట్ల మండల ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News