Monday, December 23, 2024

స్టయిలిష్ లుక్

- Advertisement -
- Advertisement -

Akkineni Akhil act in Surender Reddy director

 

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ’ఏజెంట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సినిమా యూనిట్ సరికొత్త పోస్టర్‌తో అతనికి బర్త్‌డే విషేష్ తెలిపింది.

ఫుల్‌లెంత్ యాక్షన్ రోల్ చేస్తున్న ఈ యంగ్ హీరో ‘ఏజెంట్’ పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయ్యాడు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో కండలు తిరిగిన శరీరంతో స్టయిలిష్‌గా సిగరెట్ తాగుతూ అఖిల్ దర్శనమిచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ రచయిత, దర్శకులు వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News