Sunday, December 22, 2024

బాలకృష్ణపై అక్కినేని అభిమానుల ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

అనంతపురం: బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కినేని కుటుంబానికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కినేని చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఎపి, తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. వీరసింహా రెడ్డి సక్సెస్ మీట్‌లో నటుడు బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎఎన్‌ఆర్, ఎస్‌వి రంగారావు ఉద్దేశించి బాలయ్య చేసిన వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్ సీరియస్ అయ్యారు.

దీంతో సోషల్ మీడియాలో నందమూరి, అక్కినేని అభిమానులు మధ్య యుద్ధం నడుస్తోంది. అక్కినేని కుటుంబానికి బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని అక్కినేని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ ముందు అక్కినేని, తొక్కినేని అంటూ అసభ్యకర పదజాలం బాలకృష్ణ ఉపయోగించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే గుర్తుకు వచ్చేది మాద్రాసు. అలాంటిది తెలుగు సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన ఘనత అక్కినేని నాగేశ్వర రావుకు దక్కుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News