Monday, January 20, 2025

ముంబై మురికివాడల నేపథ్యంలో కుబేర

- Advertisement -
- Advertisement -

నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థల పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ కుబేర. ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ధనుష్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. విషయం ఏమిటంటే, మే 2న తమ మూవీ నుండి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ రానుందని తాజాగా మేకర్స్ తమ సోషల్ మీడియా ప్రొఫైల్ ద్వారా తెలిపారు.

మరి ఇంతకీ ఆ అప్‌డేట్ ఏంటో తెలియాలి అంటే మరొక మూడు రోజుల సమయం ఆగాల్సిందే. కాగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న కుబేర మూవీని ఈ ఏడాదే ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చే అవకాశం ఉంది. అయితే ఇటీవల నాగ్ పాత్రపై క్లారిటీ వచ్చింది. శేఖర్ కమ్ముల మొదటిసారిగా తన జోనర్ నుంచి బయటికి వచ్చి యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా కథ ముంబై మురికివాడల నేపథ్యంలో ఉండనుంది అని సమాచారం. ఇందులో నాగార్జున పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారట. శివమణి తరవాత నాగార్జున పోలీస్ పాత్రలో నటిస్తున్న సినిమా ఇదే కావటం గమనార్హం. శివమణి సినిమాలో నాగ్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టాడు. దాదాపు 20 ఏళ్ళ తరవాత శేఖర్ కమ్మల కోసం ఖాకీ చొక్కా వేసుకుంటున్నాడు నాగార్జున.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News