Wednesday, January 22, 2025

రెండో టెస్టుకు అక్షర్ పటేల్

- Advertisement -
- Advertisement -

Akshar Patel for the second Test

 

మొహాలీ: శ్రీలంకతో జరిగే రెండో టెస్టు కోసం టీమిండియాలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. గాయంతో తొలి టెస్టుకు దూరంగా ఉన్న అక్షర్ పటేల్‌ను తిరిగి టీమిండియాలోకి తీసుకున్నారు. కుల్దీప్ యాదవ్ స్థానంలో అక్షర్‌కు జట్టులో స్థానం కల్పించారు. లంకతో మార్చి 12 నుంచి భారత్ రెండో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం అక్షర్‌ను జట్టులోకి తీసుకున్నారు. అక్షర్ చేరడంతో కుల్దీప్ టెస్టు జట్టు నుంచి తప్పుకున్నాడు. కొంతకాలంగా అక్షర్ టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ నిలకడైన ఆటతో అలరిస్తున్నాడు. అయితే వరుస గాయాలు అతనికి ప్రతికూలంగా మారాయి. గాయాల వల్ల తరచూ జాతీయ జట్టుకు దూరం కావాల్సి వస్తోంది. వెస్టిండీస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌కు కూడా అక్షర్ అందుబాటులో లేకుండా పోయాడు. అయితే ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో తిరిగి టీమిండియాకు ఎంపికయ్యాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News