Saturday, February 22, 2025

అక్షర్ హ్యాట్రిక్ మిస్..

- Advertisement -
- Advertisement -

దుబాయి: బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ తృటిలో హ్యాట్రిక్ సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. టీ మిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ జారవిడవడంతో అక్షర్ హ్యాట్రిక్ ఛాన్స్ చేజారింది. అయితే క్యాచ్‌ను విడిచి పెట్టిన రోహిత్ వెంటనే అక్షర్ క్షమాపణలు చెప్పాడు. అక్షర్ బంగ్లా ఇన్నింగ్స్‌లో 9వ ఓవర్‌ను వేశాడు. రెండో బం తికే ఓపెనర్ తంజిద్‌ను ఔట్ చేశాడు. తర్వాతి బంతికే సీనియర్ ఆటగాడు ముష్ఫికుర్ రహీం (0)ను కూడా వెనక్కి పంపాడు. ఈ రెండు క్యాచ్‌లను కూడా వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ పట్టాడు. తంజిద్, రహీం ఔటైన తర్వాత జాకేర్ అలీ కూడా స్లిప్‌లో దొరికిపోయేవాడే. కానీ చేతికందిన బంతిని స్లిప్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ చేజార్చాడు. దీంతో అక్షర్ హ్యాట్రిక్ చేసే అవకాశాన్ని కోల్పోక తప్పలేదు. ఇక క్యాచ్‌ను విడిచి పెట్టిన రోహిత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తాను చేసిన పొరపాటకు పశ్చాత్తాపపడ్డాడు. అంతేగాక ఆ వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా సహచరుడు అక్షర్‌కు క్షమాపణ చెప్పేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News