Friday, November 22, 2024

ఏ హీరోయిన్‌కు దక్కని ఘనత నాకు దక్కింది

- Advertisement -
- Advertisement -

AKSHARA Movie to Release on Tomorrow

‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ చిత్రంతో టాలెంటెడ్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది కన్నడ నాయిక నందితా శ్వేత. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రమ్, శ్రీనివాస కళ్యాణం లాంటి చిత్రాలతో ఆకట్టుకుంది. తాజాగా నందితా శ్వేత తన కొత్త సినిమా ‘అక్షర’ తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. సినిమా హాల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం ‘అక్షర’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా నందితా శ్వేత మాట్లాడుతూ “ఈ చిత్రంలో నేను విద్యార్థులతో ఎక్కువగా మాట్లాడుతాను. ట్విస్ట్ ఉంటుంది కథలో. ఆ మలుపు ఏంటి అనేది చెప్పను. సినిమాలో చాలా ఎంటర్‌టైన్ మెంట్ ఉంటుంది. ఏదో సందేశం చెబుతున్నాం. మీరు కూర్చుని చూడండి అని ఉండదు. మెసేజ్ కాకుండా సినిమాకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి.

‘అక్షర’ నాకు ఒక ఛేంజ్ ఓవర్ మూవీ అనుకోవచ్చు. ఈ మూవీ కోసం నన్ను పిలిచినప్పుడు హారర్ మూవీనే కదా అనుకున్నాను. కానీ చిన్న కృష్ణ కథ చెప్పినప్పుడు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. షకలక శంకర్, మధు నందన్, సత్య, అజయ్ ఘోష్ క్యారెక్టర్లు చేసిన కామెడీ చాలా బాగుంటుంది. అక్షర సినిమాలో హారర్ లేదు. సస్పెన్స్ ఉంటుంది. ఇక నా సినిమాల్లో ఇటీవల ‘కపటధారి’ థియేటర్లలో రిలీజ్ అయింది. దీంతో పాటు ‘అక్షర’తో కలిపి నేను చేసిన నాలుగు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. ఇది మరే హీరోయిన్‌కు దక్కని ఘనత నాకు దక్కిందని అనుకోవచ్చు”అని అన్నారు.

AKSHARA Movie to Release on Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News