రష్మిక మందనా, అనుష్క శెట్టి, కత్రినా కైఫ్, కాజోల్, నోరా ఫతే అలీఖాన్ ల తర్వాత ఇప్పుడు హీరో అక్షయ్ కుమార్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. సైబర్ మోసగాళ్లు ఒక గేమ్ యాప్ ను అక్షయ్ కుమార్ ప్రమోట్ చేసినట్లుగా డీప్ ఫేక్ వీడియో తయారు చేసి, నెట్ లో పెట్టారు. దీనిపై అక్షయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తయారు చేసిన డీప్ ఫేక్ వీడియోలో ఏవియేటర్ అనే గేమ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, ఆడవలసిందిగా అక్షయ్ కుమార్ కోరుతున్నట్లుగా ఉంది. ఇలాంటి గేమ్ యాప్ లకు అక్షయ్ ఎన్నడూ ఎలాంటి ప్రచారమూ నిర్వహించలేదనీ, దయచేసి వాటిని నమ్మవద్దనీ అక్షయ్ సన్నిహిత వర్గాలు కోరుతున్నాయి.
సినిమాల విషయానికి వస్తే, హీరో అక్షయ్ నటించిన బడేమియా ఛోటే మియా మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆయన స్కై ఫోర్స్, సింగం ఎగైన్, వెల్కమ్ టు ది జంగిల్, హేరా ఫేరీ 3, వేదత్ మరాఠే వీర్ దౌడుల్ సాత్ అనే మూవీల్లో నటిస్తున్నారు.