Wednesday, January 22, 2025

3 నిమిషాల్లో 184 సెల్ఫీలు: అక్షయ్ గిన్నిస్ రికార్డు (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గిన్నిస్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేశారు. తన కొత్త చిత్రం సెల్ఫీ చిత్ర ప్రమోష్ కోసం ముంబైలో అభిమానులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్షయ్ 3 నిమిషాల్లో 184 పెల్ఫ్ ప్రొట్రేట్ ఫోటోగ్రాఫ్స్(సెల్ఫీలు) తీసుకుని రికార్డు బ్రేక్ చేశారు. 2018లో జేమ్స్ స్మిత్(అమెరికా) కార్నివాల్ డ్రీమ్ అనే క్రూయిజ్ షిప్‌లో 3 నిమిషాల్లో 168 సెల్ఫీలు తీసుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించగా ఆ రికార్డును ఇప్పుడు అక్షయ్ తిరగరాశారు.

2015లో హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ 3 నిమిషాల్లో 105 సెల్ఫీలు తీసుకోవడం అప్పట్లో ఒక రికార్డు. సెల్ఫీలలో గిన్నిస్ బుక్ రికార్డును సాధించడం చాలా ఆనందంగా ఉందని, ఇది తన అభిమానులతో కలసి పంచుకుంటున్నానని అక్షయ్ తెలిపారు. ఇప్పటి వరకు తాను సాధించిన విజయాలన్నీ తన అభిమానుల మద్దతుతో పొందినవేనని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 24న సెల్ఫీ చిత్రం విడుదల కానున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News