ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. అన్నీ పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల లిస్ట్‌ను ఫైనల్ చేశాయి. కొన్ని రాష్ట్రాలలో అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్, బిజెపి, ఆప్ వంటి పార్టీలు వెల్లడించాయి. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గత ఎన్నికలలో ఏడు లోక్ సభ స్థానాలను బిజెపి గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది. ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉండగా కాంగ్రెస్ మూడు, ఆప్ నాలుగు స్థానాలలో కలిసి ఇప్పుడు పోటీ చేస్తున్నాయి. ఓటు బ్యాంకు విడిపోకుండా ఆప్-కాంగ్రెస్ లు కలిసి పోటీ చేస్తున్నాయి. మళ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ఢిల్లీ సీట్లను క్లీన్ స్వీప్ చేయాలని బిజెపి భావిస్తోంది. దీంతో లోక్‌సభ స్థానం నుంచి ఓ నటుడిని బరిలోకి దించాలని బిజెపి ఆలోచన చేస్తుంది. స్థానికతను దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ను బరిలోకి దించాలని యోచిస్తున్నట్టు సమాచారం. చాందినీ చౌక్ నుంచి అక్షయ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియా కోడైకూస్తోంది. దీనిపై అధికారంగా బిజెపి ప్రకటన చేయలేదు.
చాందినీ చౌక్ నుంచి అక్షయ్ కుమార్ పోటీ?
- Advertisement -
- Advertisement -
- Advertisement -