Monday, December 23, 2024

ఇండియానే అన్నీ ఇచ్చింది.. కెనడా పాస్‌పోర్టుకు అక్షయ్ బైబై

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: యాక్షన్ స్టార్ అక్షయ్‌కుమార్ తన కెనడా పాస్‌పోర్టును వదులుకోనున్నారు. అక్షయ్‌కు కెనడా పౌరసత్వం ఉండటం పట్ల తరచూ విమర్శలు ఎదురవుతున్నాయి. తనకు భారతదేశమే అన్నీ అని చెపుతున్న అక్షయ్ తాను పాస్‌పోర్టు మార్పిడికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. తాను కెనడా పాస్‌పోర్టును ఎందుకు తీసుకోవల్సి వచ్చిందో తెలుసుకోకుండానే విమర్శలకు దిగే వారి వైఖరికి తాను బాధపడుతున్నానని ఈ హిట్ హీరో చెప్పారు.

ఆజ్‌తక్‌లో వచ్చే సీదీ బాత్ కొత్త భాగం నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వూలో ఆయన తన పాస్‌పోర్టు విషయాన్ని ప్రస్తావించారు. ఇండియానే తనకు అన్నీనూ, తాను సంపాదించినది, పొందింది అంతా ఇక్కడి నుంచే, ఇక్కడి వారి అభిమానం ద్వారానే, దీనికి తాను ప్రతిఫలం చెల్లించుకోవల్సి ఉంటుంది. ఈ అవకాశం కోసం చూస్తున్నానని ఆయన చెప్పారు. తనకు జయాపజయాలు సాధారణం అని ఓ ఏడాది 15 సినిమాలు ఫ్లాప్ అయ్యాయని, బాక్సాఫీసు వద్ద ఈ ఫలితంతో కంగుతిని తాను ఎందుకైనా మంచిదని కెనడా పాస్‌పోర్టు తీసుకున్నానని తెలిపారు.

తన స్నేహితుడు ఒక్కరు కెనడాలో స్థిరపడ్డారని, ఆయన సలహా మేరకు అక్కడ ఏదో చేద్దామని పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నానని ఉన్నదున్నట్లుగా తెలిపారు. అక్షయ్ గత లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీని కలవడం, ఆ తరువాత మోడీని కొనియాడటం చేసిన దశల్లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం సంకేతాలు వెలువడ్డాయి. అయితే కెనడా పాస్‌పోర్టు అంశం ఆయన పూర్తి స్థాయి జాతీయతకు ప్రశ్నార్థకం అయింది. ఈ దశలో అక్షయ్ తాను కెనడా పాస్‌పోర్టును వీడుతున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News