Sunday, December 22, 2024

‘జానీ దుష్మన్’ సినిమా జీతంతోనే ఇల్లు కొన్నాను: అక్షయ్ కుమార్

- Advertisement -
- Advertisement -

 

Akshay Kumar reveals

ముంబై: ప్రముఖ హిందీ సినిమా నటుడు అక్షయ్ కుమార్ ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రామ్ లో అనేక ఆసక్తికర వ్యక్తిగత విషయాలు తెలిపారు. ఆయన ప్రస్తుతం సినిమా రంగంలో 30 ఏళ్లు గడిపేశారు. తన జీవితంలో మైలు రాళ్లుగా నిలిచిన ఘటనలను ఆయన టివి ప్రోగ్రాంలో వివరించారు. 2002లో విడుదలైన తన సినిమా ‘జానీ దుష్మన్’ గురించి చెబుతూ ఆ సినిమా వల్లే తాను ఇల్లు కొనుకున్నానని అన్నారు. ‘‘ మీరు నమ్మరు… కానీ ఆ రోజుల్లో నాకు డబ్బు చాలా అవసరమైంది. నేను ఇల్లు కొనుక్కోడానికి ‘జానీ దుష్మన్’ సినిమానే తోడ్పడింది’ అని చెప్పారు. ఆ సినిమాలో తన పాత్ర చనిపోవాల్సి ఉండిందని ఆయన తెలిపారు. కానీ ఆ సినిమాలో తన పాత్రను చంపేయొద్దని ఆయన బతిమిలాడుకున్నారట. దాంతో అతడి పాత్ర మరో 5 రోజులకు పొడగించబడిందని, తద్వారా తాను డబ్బు సంపాదించుకున్నానని ఆయన తెలిపారు.

‘‘ నేను రోజువారి చెల్లింపు ఆధారంగా సినిమాలో పనిచేశాను. అందులో విలన్ నన్ను చంపేయాలి. అయితే ఆ సినిమాలో నటించే మరో నటుడు న్యూయార్క్ లో చిక్కుకుపోయి రాలేకపోయాడు. దాంతో నేను డైరెక్టరు దగ్గరికి పోయి ‘‘వెళ్లిపోయి మళ్లీ రావాలా?’’ అని  అడిగాను అని అక్షయ్ తెలిపారు. అక్షయ్ పేర్కొన్న ఆ సహనటుడు సన్నీ డియోల్. నాడు తనకు రెండు గంటలు పనిచేస్తే రూ. 21,000 చెల్లించేవారని తెలిపారు. నేను సినిమా రంగంలోకి వచ్చాక ఏం చేయాలో కూడా నాకు తెలియదు. కానీ నాకు డబ్బు కావాల్సి ఉండింది. సినిమా రంగంలోకి రాక ముందు తాను మార్షల్ ఆర్ట్స్ బోధించేవాడనని, నెలకు రూ. 5000 సంపాదించేవాడినని, అప్పుడే సినిమాలో 2 గంటలు పనిచేస్తే రూ. 21,000 ఇస్తారన్న ప్రకటన చూశానన్నారు. దాంతో నటించి ఆ డబ్బు పొందాలనే తాను సినిమా రంగంలోకి వచ్చానన్నారు.

అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘రక్షా బంధన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. అందులో భూమి పెడ్నేకర్ తో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కాబోతున్నది. అది బాక్సాఫీసు వద్ద అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ ఛడ్డా’ తో పోటీపడనుంది. ఆయన ఇటీవలి సినిమా ‘పృథ్వీరాజ్’. ఆయన రాబోయే సినిమాలు ‘రామ్ సేథు’, ‘బడే మియా ఛోటే మియా’, ‘సెల్ఫీ’.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News