Sunday, December 22, 2024

భారతే నాకంతా: అక్షయ్ కుమార్

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్(55) కెనడా దేశపు గౌరవ పౌరుడు(ఆనరరీ సిటిజెన్). ఆయన తన కెనడా పాస్‌పోర్ట్‌ను వాపస్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఆయన కెనడా పౌరసత్వంపై చాలామంది ఇష్టమున్నట్లు మాట్లాడుతుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘ఆజ్‌తక్’కు ఇచ్చిన ఇంటర్వూలో ‘నాకంతా భారతే. నేను సంపాదించింది, సాధించింది అంతా ఇక్కడే. దానిని తిరిగి దేశానికి ఇచ్చే అదృష్టం కూడా నాకు లభించింది. ఏమి తెలియకుండానే కొందరు నోటికొచ్చింది మాట్లాడుతుండడంతో బాధనిపిస్తుంటుంది…’ అన్నారు.

2017లో ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథా’ సినిమా ప్రమోట్ చేస్తున్నప్పుడు అక్షయ్ కుమార్ తాను కెనడా గౌరవ పౌరుడనని తెలిపారు. 1990 దశకంలో అక్షయ్ కుమార్ 15 సినిమాలు ఫెయిల్ అయ్యాయి. నాడు ఆయనకు కాలం కలిసి రావడంలేదు. అప్పుడే ఆయన కెనడా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Rajesh Khanna

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News