Thursday, December 26, 2024

జూన్ 10న వస్తున్న ‘పృథ్వీరాజ్’..

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ కిలాడీ అక్షయ్‌కుమార్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘పృథ్వీరాజ్’. ఈ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. జూన్ 10న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడిస్తూ కొత్త పోస్టర్స్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్ సరసన మానుషీ చిల్లర్ కథానాయికగా నటిస్తుండగా.. సోనూసూద్, సంజయ్ దత్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డాక్టర్ చంద్ర ప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు భాషలతో పాటుగా ఐమ్యాక్స్‌లో కూడా విడుదల కానుంది.

Akshay Kumar’s Prithviraj to Release on June 10

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News