Saturday, December 21, 2024

యాదాద్రి క్షేత్రపాలకుడికి ఆకుపూజ

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : శ్రీలక్ష్మీనరసింహస్వామి యాదాద్రి క్షేత్రంలో ఆలయ క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయస్వామికి విశేషంగా ఆకుపూజను అర్చకులు నిర్వహించారు. మంగళవారం శ్రీ ఆ ంజనేయస్వామికి విశేషమైన రోజు కావడంతో ఉదయం శ్రీఅంజనేయస్వామి వారికి సింధూర లేపణం నిర్వహించి లక్ష తమలపాకులతో నాగవల్లి దళార్చన జరిపి శాస్త్రోక్తంగా ఆకుపూజను నిర్వహించారు. పాతగుట్ట పుష్కరిణి వద్ద గల ఆలయంలో ఆకుపూజను నిర్వహించగా భక్తులు పాల్గొని దర్శించుకున్నారు.

ఆలయ పూజలలో భక్తులు..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనార్ధం వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆలయంలో నిర్వహించినటువంటి ని త్యపూజల కైంకర్యాలలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనార్ధం వివి ధ ప్రాంతాల నుంచి భక్తులు పిల్లాపాపలు, కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి క్షేత్రానికి తరలివస్తున్నారు. ఆలయంలో జరిగిన నిత్యపూజలు సుప్రభాతం,అర్చన, అభిషేకం, సుదర్శన నారసింహ హో మం, నిత్యకల్యాణం, పుష్పార్చన, జోడి సేవ తదితర పూజలలో భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకొని తమ మొక్కులు చె ల్లించుకున్నారు. కొండపైన కొలువుదీరిన శ్రీరామలింగేశ్వరస్వామి శివాలయంలో భక్తులు శివదర్శనం చేసుకొని పూజలు నిర్వహించగా, కొండకింద గల శ్రీపాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని కూడా భక్తులు సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.

నిత్యరాబడి..
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదాద్రి క్షేత్రంలో స్వామివారి ఆలయం నిత్యరాబడి భాగంగా మంగళవారం రూ. 15,10,770 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నిత్యరాబడిలో అనుభంద ఆలయమైన పాతగుట్ట దేవాలయం, వివిధ శాఖల నుండి స్వామివారి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News