- Advertisement -
కాబూల్: అల్ ఖైదా అగ్రనేత అల్ జవహారిని అమెరికా సైన్యం హతమార్చింది. అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లో అమెరికా సైన్యం డ్రోన్లతో ఇంట్లోనే జవహరీని మట్టుబెట్టింది. అమెరికాకు చెందిన డ్రోన్ మిస్సైల్ జవహారి ఇంట్లోకి వెళ్లి అతడిపై దాడి చేయడంతో అతడు చనిపోయాడు. ఈజిప్టు సర్జన్ అయిన అల్ జవహరీ ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదుల్లో ఒకరిగా ఉన్నాడు. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని ట్విన్ టవర్స్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 3000 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పాల్పడిన వారిలో జవహారి ఒకరని అమెరికా గుర్తించింది. 2011లో పాకిస్థాన్ దాక్కున్న ఓసామా బిన్ లాడెన్ ను అమెరికా సైన్యం హతమార్చిన తరువాత అల్ ఖైదా అధినేతగా జవహారి ఉన్నాడు. గతంలో జవహరీ తలపై 25 మిలియన్ల డాలర్ల రివార్డును యుఎస్‌ఎ ప్రకటించిన విషయం తెలిసిందే.
- Advertisement -