Thursday, January 23, 2025

అల్ ఖైదా ఉగ్ర గ్రూపుపై దాడి.. 3 రాష్ట్రాలలో 14 మంది అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నిషిద్ధ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు చెందిన ఒక గ్రూపును ఛేదించి జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ నుంచి 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు మూడు రాష్ట్రాల పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లు గురువారం అధికారులు వెల్లడించారు. జార్ఖండ్‌లోని రాంచికి చెందిన డాక్టర్ ఇస్తియాఖ్ ఈ గ్రూపునకు నాయకుడిగా వ్యవహరిస్తున్నట్లు వారు చెప్పారు. ఖిలాఫత్‌ను ఇస్లాం రాజ్యం)ను ప్రకటించి దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాలని ఈ గ్రూపు కుట్ర పన్నుతోందని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ఉగ్రవాద గ్రూపు సభ్యులు ఆయుధాలతోసహా అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణలో శిక్షణ పొందారని వారు తెలిపారు. ఆయుధాల శిక్షణ పొందుతున్న ఆరుగురు వ్యక్తులను రాజస్థాన్‌లోని భివండిలో అరెస్టు చేయగా మిగిలిన 8 మందిని జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్‌లో అరెస్టు చేసినట్లు వారు చెప్పారు. ప్రస్తుతం వారిని ప్రశ్నిస్తున్నామని, ఆయుధాలు, మందుగుండు, పత్రాల స్వాధీనం కోసం దాడులు నిర్వహించామని అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News