Monday, December 23, 2024

సస్పెన్స్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

కాకా మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరో గా రాజ్ శంకర్, పూర్ణ, నాగ బాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి ప్రధాన పాత్రలో రాఘవ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఆలా ఇలా ఎలా‘. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన బాణీలను హిందూపూర్‌లో విడుదల చేశారు.

ఈ చిత్రాన్ని జులై 21న ఎస్‌కెఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా విడుదల చేస్తారు. ఈ ఆడియో విడుదల వేడుకకు ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ముఖ్య అతిధిగా విచ్చేసి ట్రైలర్, ఆడియోని విడుదల చేశారు. హీరో శక్తి వాసుదేవన్ మాట్లాడుతూ “83 రోజుల్లో మంచి మంచి లొకేషన్స్ లో ఈ సినిమాను చిత్రీకరించాం.

ఈ సినిమా కథ, కథనం గొప్పగా ఉంటుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కెఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ అధినేత ఆదినారాయణ మాట్లాడుతూ “ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చింది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కొల్లకుంట నాగరాజు, రేవతి, నిషా కొఠారి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News