అమెరికా లోని బర్మింగ్‌హామ్ నైట్‌క్లబ్‌లో శనివారం జరిగిన కాల్పుల్లో నలుగురు మృతిచెందగా, నగరం లోని ఒక ఇంటి వెలుపల కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. .బర్మింగ్‌హామ్ 27వ స్ట్రీట్ నార్త్ 3400 బ్లాక్‌లో ఈ సంఘటన జరిగిందని బర్మింగ్‌హామ్ పోలీస్ ఆఫీసర్ ట్రూమన్ ఫిట్జ్‌జెరాల్డ్ చెప్పారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు రాత్రి 11 గంటలకు సంఘటన స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు సహా నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్నబర్మింగ్‌హామ్ ఫైర్ అండ్ రిస్కూ సిబ్బంది అక్కడికి చేరుకుని నైట్ క్లబ్‌లో ఇద్దరు మహిళలు చనిపోయినట్టు ప్రకటించారని పోలీస్ అధికారి ఫిట్‌జగెరాల్డ్ తెలిపారు. ఇదిలా ఉండగా క్లబ్ సమీపంలో ఫుట్‌పాత్‌పై ఒకరు శవమై కనిపించారు.
రెండవ వ్యక్తి బర్మింగ్ హామ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు. ఈ కాల్పుల్లో 9 మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆగంతకుడు వీధిలో ఉన్న నైట్‌క్లబ్ లోకి కాల్పులు జరిపాడని, దర్యాప్తులో తేలిందని, ఫిట్జ్‌గెరాల్డ్ తెలిపారు. ఇదిలా ఉండగా, బర్మింగ్‌హామ్ లోని ఒక ఇంటి వెలుపల కాల్పుల సంఘటన కూడా వెలుగు లోకి వచ్చింది. బర్మింగ్‌హామ్ లోని ఒక ఇంటి వెలుపల కాల్పుల సంఘటన కూడా వెలుగు లోకి వచ్చింది. ఈ సంఘటన బర్మింగ్‌హామ్ లోని ఇండియన్ సమ్మర్ డ్రైవ్ లోని 1700 బ్లాక్‌లో సాయంత్రం 5.20 గంటలకు జరిగింది. ఇంటి బయట వాహనంపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక వ్యక్తి, ఓ మహిళ, 5 ఏళ్ల వయసున్న చిన్న పిల్లవాడు ఉన్నారు. ఈ విషయంలో స్థానికుల సహాయం కోరుతున్నామని, ఇంటిబయట అమర్చిన సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నామని పోలీస్‌లు తెలిపారు.