Thursday, January 23, 2025

జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఆలేరు

- Advertisement -
- Advertisement -

Alair police station is best in national

ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2021 సంవత్సరానికి ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపిక చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏటా దేశవ్యాప్తంగా 75 పోలీస్ స్టేషన్ లో ప్రాథమికంగా ఎంపిక చేసి వాటి పనితీరు ఆధారంగా ర్యాంకులను నిర్ణయిస్తారు. వీటిలో ఆలేరు పోలీస్ స్టేషన్ గ్రామీణ విభాగంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపిక చేశారు. జాతీయ స్థాయిలో ప్రకటించిన పది ర్యాంకుల లో ఈ స్టేషన్ కు స్థానం దక్కింది. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పై త్వరగా పరిశోధన పూర్తి చేసి నూరుశాతం చార్జిషీట్లు దాఖలు చేయడం జరిగింది. 2021 సంవత్సరం లో నమోదైన కేసులలో నూరు శాతం ఎప్పటికప్పుడు నమోదు చేయడం, ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించడం, పోలీస్ స్టేషన్ లో పచ్చదనం పరిశుభ్రత, సైన్ బోర్డులు ఏర్పాటు, బాధితుడు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం నుంచి ఛార్జీషీట్ దాఖలు చేసే వరకు పోలీసులు పారదర్శకంగా వ్యవహరించడం లాంటి అంశాల్లో ఆలేరు పోలీస్ స్టేషన్ 100 శాతం మార్కులు సాధించి రాష్ట్రంలోని ఉత్తమంగా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News