Monday, January 20, 2025

బజాజ్ ఎలక్ట్రానిక్ షో రూమ్ లో ఆలం గ్యాంగ్ దోపిడీ

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: ఇసిఐఎల్ ప్రాంతం కుషాయిగూడలోని బజాజ్ ఎలక్ట్రానిక్ షో రూమ్ లో ఆలం గ్యాంగ్ దోపిడీ చేసిందని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. గత నెల 21న షోరూమ్ లో దోపిడీ జరిగిందని, పక్కా రెక్కీ చేసి 432 సెల్ ఫోన్లు దోపిడీ చేశారన్నారు. లూటీ అయిన వాటిలో ఐ ఫోన్లు, శాంసంగ్, ఒప్పో, ఖరీదైన ఫోన్స్ ఉన్నాయని వివరించారు. మల్కాజిగిరి సిసిఎస్ టీం, ఐటి సెల్, ఎస్ఒటి, క్లూస్ టీమ్ లతో కేస్ ఛేదించామన్నారు. దోపిడీ జరిగిన అనంతరం ట్రైన్, బస్సు మార్గాలలో నిందితులు పారిపోయారు. నిందితులను పట్టుకోవడానికి 500 పైగా సిసి టిటి ఫుటేజీలను పరిశీలించామన్నారు. మహారాష్ట్రలో జరిగిన కేసులో బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆలం గ్యాంగ్ ఫింగర్ ప్రింట్ ట్యాలీ కావడంతో నిందితులుగా గుర్తించారు. పోలీస్ టీమ్స్ వెళ్లి గాలించడంతో నిందితులు దొరికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News