- Advertisement -
అమరావతి: కృష్ణా-గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎంఎల్‌సి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ఘన విజయం సాధించారు. తొమ్మిది రౌండ్ పూర్తియ్యే సరికి రాజేంద్రకు 1,45,057 ఓట్లు రాగా రెండో స్థానంలో ఉన్న లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి. చివరికి రాజేంద్రకు 82,320 ఓట్ల మెజార్టీ రావడంతో గెలుపొందారు. చెల్లుబాటు అయిన ఓట్లలో ఆలపాటికి 60 శాతం ఓట్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు. దీంతో ఆలపాటి రాజేంద్రకు టిడిపి, బిజెపి, జనసేన నేతలు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం ఓట్లు 2,41 873 ఓట్లు పోలయ్యాయి. ఏడు రౌండు పూర్తియ్యే సరికి 21,577 ఓట్లు చెల్లనవిగా గుర్తించారు.
- Advertisement -