Thursday, January 23, 2025

అల్కరాజ్‌కు షాక్..

- Advertisement -
- Advertisement -

రోమ్: ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి అగ్రశ్రేణి ఆటగాడు కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్) రెండో రౌడ్‌లోనే ఇంటిదారి పట్టాడు. హంగేరికి చెందిన ఫాబియాన్ మరోజ్‌సాన్‌తో జరిగిన పోరులో అల్కరాజ్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. అసాధారణ ఆటను కనబరిచిన ఫాబియాన్ 63, 76 తేడాతో అల్కరాజ్‌పై సంచలన విజయం సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌కు సన్నాహకంగా జరుగుతున్న ఇటాలియన్ ఓపెన్‌లో అల్కరాజ్ ఓ అనామక ఆటగాడి చేతిలో పరాజయం పాలు కావడం విశేషం.

అయితే మూడో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా), ఆరో సీడ్ ఆండ్రీ రుబ్లేవ్ (రష్యా) రెండో రౌండ్‌లో విజయం సాధించారు. మెద్వెదే 36, 61,63 తేడాతో స్పెయిన్ ఆటగాడు బెర్నాబ్ జపాటాను ఓడించాడు. హోరాహోరీ పోరులో రుబ్లేవ్ 76, 63తో స్పెయిన్‌కే చెందిన ఫొకినాపై జయకేతనం ఎగుర వేశాడు. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ ఎలినా రిబకినా (కజకిస్థాన్), 20వ సీడ్ ఒస్టాపెంకో, 11వ సీడ్ కుదుమెత్సోవా, 12వ సీడ్ బియాట్రిజ్ (బ్రెజిల్) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News