Wednesday, January 22, 2025

అల్కరాజ్‌దే టైటిల్

- Advertisement -
- Advertisement -

Alcaraz wins in Madrid for 4th title

మాడ్రిడ్: ప్రతిష్టాత్మకమైన మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్పెయిన్ సంచలనం, ఏడో సీడ్ కార్లొస్ అల్కరాజ్ గార్ఫియా టైటిల్‌ను సాధించాడు. ఫైనల్లో అల్కరాజ్ రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ)ను ఓడించాడు. ఏక పక్షంగా సాగిన ఫైనల్లో అల్కరాజ్ 63, 61 తేడాతో జ్వరేవ్‌ను చిత్తు చేశాడు. ఆరంభం నుంచే అల్కరాజ్ దూకుడుగా ఆడాడు. జ్వరేవ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాడు. అతని ధాటికి జర్మనీ స్టార్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయాడు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన అల్కరాజ్ అలవోకగా సెట్‌ను సొంతం చేసుకున్నాడు. తర్వాతి సెట్‌లో మరింత చెలరేగి పోయాడు. చూడచక్కని షాట్లతో జ్వరేవ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇదే క్రమంలో 61తో సెట్‌ను గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

సంచలన విజయాలతో..

భవిష్యత్తు నాదల్‌గా పేరు తెచ్చుకుంటున్న అల్కరాజ్ టైటిల్ సాధించే క్రమంలో పలు సంచలన విజయాలు సాధించాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన స్పెయిన్ యువ సంచలనం అల్కరాజ్ ఏకంగా టైటిల్‌ను సాధించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అతని ఆట తీరు మొత్తం నాదల్‌లాగానే ఉంది. నాదల్ లాగానే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్నాడు. ఇక మాడ్రిడ్ ఓపెన్‌లోనూ సంచలన విజయాలతో ఆకట్టుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ నాదల్‌ను, సెమీఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా)ను అల్కరాజ్ ఓడించాడు. తాజాగా ఫైనల్లో జ్వరేవ్‌ను కూడా ఓడించాడు. అంతకుముందు 16వ రౌండ్‌లో తొమ్మిదో సీడ్ కామెరూన్ నొరి (బ్రిటన్)ను కంగుతినిపించాడు. ఇక ఈ విజయంతో అల్కరాజ్ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి ఎగబాకాడు. అతని కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News