Tuesday, December 24, 2024

భారత్ లో పెరిగిన ఆల్కాహాల్ వినియోగం

- Advertisement -
- Advertisement -

Alcohol

న్యూఢిల్లీ: గత మూడు దశాబ్దాలుగా భారతదేశంలో మద్యం వినియోగం పెరుగుతోందని మెడికల్ జర్నల్ ‘లాన్సెట్’ తాజా అధ్యయనంలో తేలింది. భారతీయ పురుషులలో ఆల్కహాల్ వినియోగం వయస్సున్న వర్గాల్లో పెరుగుతోందని లాన్సెట్ విశ్లేషణలో తేలింది. 1990 నుండి మద్యపానం 5.63 శాతం పెరిగిన 40-64 సంవత్సరాల వయస్సులో ఇది అత్యధికం, ఆ తర్వాత 15-39 సంవత్సరాల మధ్య వయస్సు గ్రూపుంది. వీరి సంఖ్య 5.24 శాతానికి పెరిగింది. కాగా వృద్ధుల్లో (65 ఏళ్లు పైబడిన వారికి) ఇది 1990 నుండి 2.88 శాతం పెరిగింది.

1990 నుంచి మహిళల్లో కూడా మద్యపానం అలవాటు పెరిగిందని ఈ అధ్యయనంలో తేలింది. 15-39 మధ్య వయస్సు ఉన్న మహిళల్లో 0.08 శాతం పెరిగింది. అయితే 65 ఏళ్ల పైబడిన మహిళలు మద్యపాన సేవనం తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News