Monday, December 23, 2024

మద్యం మత్తులో భార్య, కూతురి హత్య.. కొడుకు సేఫ్

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెను హత్య చేశాడు. ఈ ఘటన భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొడవ పడి భార్య, కుమార్తెను గొడ్డలితో నరికి చంపాడు. మృతులను ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చందన (17), రమ (43)గా గుర్తించారు.

మద్యం మత్తులో ఇంటికి తిరిగి వచ్చిన నిందితుడు రమణాచారి.. మద్యం కొనుగోలుకు డబ్బులు ఇవ్వాలని భార్యను డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో ఆమెతో గొడవకు దిగాడు. తీవ్ర వాగ్వాదం జరగడంతో ఆ వ్యక్తి గొడ్డలిని తీసుకుని దాడి చేశాడు. తల్లిని కాపాడేందుకు చందన అడ్డం రావడంతో ఆమెపై కూడా దాడి చేశాడు. భయంతో ఇదంతా చూస్తున్న రమణాచారి తొమ్మిదేళ్ల కొడుకు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని బాలుడిని కాపాడారు. వారు రమణాచారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News