Monday, December 23, 2024

బెంగళూరులో తాగుబోతు కిరాతకం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో నాగేంద్ర(32) అనే తాగుబోతు తినే అన్నంలో విషం కలిపి తన భార్య, ఇద్దరు కూతుళ్లను చంపేశాడు. తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. ‘అతడి భార్య విజయ(28), ఇద్దరు కూతుళ్లు నిశా(7), దీక్ష(5) చనిపోయారు. నిందితుడు నాగేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు’ అని పోలీసు అధికారి తెలిపారు.

తాగుబోతైన నాగేంద్ర తరచూ భార్యతో గొడవపడేవాడు. వారి వివాహం 2014లో జరిగింది. విజయ ఓ ఔషధ దుకాణంలో హెల్పర్‌గా పనిచేస్తుండేది. తలుపు కొడితే ఎంతసేపటికీ జవాబు రాకపోవడంతో విజయ సోదరుడు శశికుమార్ తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూశాడు. తన సోదరి, ఆమె ఇద్దరు పిల్లలు స్పృహ లేకుండా పడి ఉండడాన్ని చూశాడు. వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే వారు చనిపోయారని ఆసుపత్రి సిబ్బంది తెలిపింది.

శశి కుమార్ కథనం ప్రకారం నాగేంద్ర ఓ నిరుద్యోగి, పైగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ‘ఇంటికి విజయే సంపాదించే దిక్కు. నాగేంద్ర మందుల ఖర్చు కూడా ఆమె భరించేది. కానీ నాగేంద్ర మద్యానికి, మరిజువానకు అలవాటుపడిన వ్యక్తి. డబ్బు కోసం భార్యను తరచూ కొట్టేవాడు. అనేకసార్లు విజయ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది’ అని శశికుమార్ తెలిపాడు. ఇదిలావుండగా కొననకుంటే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. నాగేంద్ర కోలుకున్నాక, డాక్టర్లు అతడికి మెడికల్ క్లియరెన్స్ ఇచ్చాక అతడిని విచారించనున్నారు. కానీ అతడో క్యాన్సర్ రోగి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News