Wednesday, November 13, 2024

దీపావళి వేడుకల్లో పటాకులతో సాహసం వద్దు

- Advertisement -
- Advertisement -

అగ్ని ప్రమాదాలు, గాయాలు కాకుండా చూసుకోవాలి
తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి
పరిసరాలపై కాలుష్యం ప్రభావం లేకుండా చూడాలి
నగర ప్రజలకు దీపావళి పట్ల జాగ్రత్తలు వివరిస్తున్న వైద్యులు

Alert for Diwali celebrations

మన తెలంగాణ,సిటీబ్యూరో: దీపావళి పండుగ సంబరాలు వచ్చేశాయి. ముఖ్యంగా ఇది పిల్లల పండగ. ప్రతి రోజు స్కూలు నుంచి విశ్రాంతి తీసుకోవడంతో పాటు కొత్త బట్టలు వేసుకుని, మిఠాయిలు తిని, పటాకులు కాలుస్తూ ఎక్కడలేని ఆనందం పొందడానికి ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది. అయితే ఇదే సమయంలో తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల భద్రత గురించి ఆందోళన చెందుతుంటారు. దీపావళి సందర్భంగా జరిగే అగ్నిప్రమాదాలు, వాటిలో పిల్లలు గాయపడటం గురించి వార్తాపత్రికల్లో కథనాలు చూసి తమ వాళ్లు ఎలా ఉంటారోనని అదుర్దాగా గడుపుతారు. మరి ఈసమయంలో చేయాల్సినవి, చేయకూడనివి వైద్యులు వివరిస్తున్నారు.
పండగవేళ చేయాల్సినవి ః దీపావళి సందర్భంగా ఇంట్లోనే ఉండి, బయటకు వెళ్లి, కుటుంబ సభ్యులు కరోనా తెచ్చుకోవద్దు, ఇంట్లోలో పండగ చేసుకోవాలి, ఇంటిని అందంగా అలంకరించి లోపల ఆడుకునే ఆటలతో, సినిమాలు చూస్తూ ఇంట్లో ఆనందంగా గడపాలి.
కుటుంబ సభ్యులు పటాకులు కాల్చకుండా ఉండలేకపోతే ప్రభుత్వ లైసెన్సు ఉన్న దుకాణంలో కొనాలి. పటాకులను ఎప్పుడు మూసి ఉంచే సురక్షితమైన పెట్టెలో పెట్టాలి.వాటిని మంటలకు దూరంగా ఉంచాలి. చిన్నపిల్లలు, పాకే పిల్లలు వాటికి దూరం పెట్టండి. పెట్టెలమీద రాసిపెట్టిన సూచనలు, భద్రతా సూచనలు పాటించాలి.
బహిరంగ స్దలాల్లో, సామాజిక దూరం పాటించేగలిగే చోటే పటాకులు కాల్చాలి, కళ్లు, ముక్కు, నోరు మూసి ఉంచేలా మాస్కు ఫేస్ ఫీల్డ్ ధరించాలన్నారు.రాకెట్లు ముట్టించేటప్పుడు అవి కిటికీలు, తలుపులు, రోడ్లవైపు కాకుండా ఆకాశంవైపు ఉండేలా చూసుకోవాలి. పటాకులను ఒక చేతి దూరం నుంచి మాత్రమే కాల్చాలి.
వాడేసిన పటాకులను ఒక బకెట్ నీటి వేయాలి.
ప్రమాదం జరగకుండా ఎప్పుడు బకెట్లో నీళ్లు, దుప్పట్లు సిద్దంగా ఉంచుకోవాలి, ఇంట్లో పటాకులు కాల్చేటప్పుడు చిన్న గాయాలైతే చికిత్స కోసం ప్రథమ చికిత్స కిట్లు సిద్దంగా పెట్టుకోవాలి, దీపావళి సమయంలో సురక్షితంగా ఉండేందుకు అగ్నిమాపక పరికరం దగ్గర్లో ఉంచాలి.
పటాకలు ముట్టించేటప్పుడు పిల్లలు సరైన పాదరక్షలు ధరించాలి, పిల్లలు తేలికపాటి, కాటన్ దుస్తులను మాత్రమే ధరించి పటాకులు కాల్చాలి.
దీపావళి వేళ చేయకూడనివి ః రద్దీ ప్రదేశాలు, ఇరుకు సందులు, ఇంటిలోపల పటాకులు కాల్చరాదు, పెద్ద పెద్ద గుంపులుగా వెళ్లకుండా సామాజిక దూరం పాటించాలి. దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి కరచాలనం, అలింగనం చేసుకోకూడదు, పెద్దలు లేకుండా పిల్లలను పటాకులు కాల్చనివ్వద్దు.
పటాకులు జేబులు, సంచుల్లో పెట్టవద్దు, కాల్చి, పేలని పటాకులను వెళ్లి చూడవద్దు, వాటిని వదిలేసి కొత్తవి కాల్చాలి. చేతుల్లో పట్టుకుని కాల్చవద్దు, వాటిని తగిన దూరం నుంచి వెలిగించాలి, సాహసాలు చేయాలంటే సురక్షితంగా, ఉత్పాదక కార్యకలాపాల్లోనే చేయాలి.
వదులు దుస్తులకు త్వరగా మంటలు అంటుకుంటాయి, సిల్క్, సింథటిక్ మెటీరియల్ దుస్తులు వేసుకోవద్దు,
దీపాలు, కొవ్వొత్తులను కర్టెన్లు, కాలే సామాగ్రికి దగ్గరగా పెట్టరాదు, ఒకేసారి ఎక్కువ పటాకులు కాలిస్తే ప్రమాదం జరుగుతుంది, అలా చేయకూడదు. అగిపెట్టెలు, లైటర్లు వాడవద్దు, పటాకులతో ప్రయోగాలు చేయవద్దని, సొంతంగా తయారు చేసుకోకూడదు, రోడ్లమీద పటాకులు కాల్చవద్దు, వాటితో ప్రమాదాలు జరుగుతాయని, పేలే పటాకులను పిల్లలకు ఇవ్వకూడదు, వాటి బదులు వెలుగు వచ్చేవి, సురక్షితమైనవే ఇవ్వాలి.
పిల్లలను భౌతికంగా సురక్షితంగా ఉంచడంతో పాటు, ఇతరుల భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్యులు డా. ఎం. అరవింద్ కుమార్ పేర్కొన్నారు. పటాకుల చప్పుళ్లతో పెద్దవారికి కలిగే ఇబ్బందులు,ఆస్దమా రోగులకు కలిగే బాధలు ,పెంపుడు జంతువుల కష్టాలు కూడా పిల్లలకు వివరించాలి. పటాకులు కాల్చడంతో కాలుష్య స్దాయిపై పడే ప్రభావం కూడా చెప్పి, పిల్లలు ఇతరుల భద్రత గురించి ఆలోచించేలా చూడాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News