Friday, December 27, 2024

జిల్లా ప్రజలను అప్రమత్తం చేయండి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:జిల్లాలో గత వారం రోజుల నుండు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జి ల్లా యంత్రాంగం నిబద్ధతతో కలసి పనిచేస్తూ పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కల్లెక్టరేట్లో వెబెక్స్లో జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు, అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్, ఏ. వెంకట రెడ్డి లతో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో మళ్ళీ రెండు రోజుల్లో 40 సెంటిమిటర్ల తో భారీ వర్షాలు పడనున్నాయని ఆదిశగా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో శిథిలా భవనాలు, పాఠశాలను ఇప్పటికే గుర్తించామని ప్రజలను, విద్యార్థులను భవనాల వద్దకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యానంగా కాజ్ వేలు వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉంటున్నదున బారికేట్స్ ఏర్పాటు చేసి పోలీసులను అందుబాటులో ఉంచాలని తెలిపారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మట్టితో ఉన్న పాత ఇండ్లు తడిసి ఉన్నందున ఆ కుటుంబాలను పక్క భవనాలలో తరలించాలని మున్సిపల్, జి.పి అధికారులను ఆదేశించారు. ప్రయాణికులు ప్రయాణాలు రెండు రోజులు పెట్టుకోవద్దని సూచించారు. విద్యుత్ విషయంలో ప్రజలకు పూర్తి స్థాయిలో అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు. నిండిన చెరువులలో నీరు వెంటనే కిందికి వదళాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్, ఇరిగేషన్,రెవెన్యూ, పోలీస్, మెడికల్ శాఖలు తదితర అనుబంధ శాఖలు నిబద్ధతతో కలసి పని చేయాలని సూచించారు.

జిల్లాలోని వాగులు, వంకలు, కాజ్ వేలు వర్షపు వరద నీరు తుంగతుర్తి మండలంలోని వెలుగు పల్లి నుండి కేశవ పురం అలాగే సంగం నుండి కోడూరు, జాజిరెడ్డి గూడెం మండలం కొమ్మల నుండి కోడూరు, మోతె మండలం నరసింహ పురం, నర్ససింహ పురం నుండి నాయకనిగూడెం వరకు, నడిగూడెం మండలం తెల్లబెల్లి నుండి త్రిపురారం అలాగే చివ్వేంల నుండి ముకుందా పురం దగ్గర నుండి నసీం పేట ఆత్మకూరు యస్ మండలం వరకు వరద వృదృతి ఉంటుందని పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం మండలాల వారీగా సమీక్షించారు.ఈ సమావేశంలో జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News