Thursday, November 14, 2024

క్షేత్ర స్థాయిలో చెరువులు తనిఖీ చేయండి

- Advertisement -
- Advertisement -

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం
పరిరక్షణకు 15ప్రత్యేక బృందాలు ఏర్పాటు
అధ్యయనం చేసి రెండు రోజుల్లో నివేదిక
ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరి రజత్ కుమార్

Alerted for heavy rains in Telangana
మనతెలంగాణ/హైదరాబాద్:  గులాబ్ తుపాను కారణంగా రాష్ట్ర మంతటా తలెత్తిన పరిస్థితులపై మంగళవారం నాడు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఆ శాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. వాతావరణ కేంద్రం నుంచి వెలువడుతున్న భారీవర్షాల హెచ్చరికల నేపధ్యంలో అధికార యంత్రాగం పూర్తి అప్రమత్తంగా ఉంటూ అన్ని విధాల సిద్దంగా ఉండాలని అధికారులను హెచ్చరించారు. గ్రేటర్ హైదరబాద్ పరిధిలోని చెరువులు కుంటల పంటల పరిరక్షణ కోసం సినియర్ ఇంజనీర్లతో 15ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితులను సమీక్షించారు. మరో మూడు రోజుల పాటు ఉరుములు , మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపధ్యంలో అన్ని జిల్లాల్లో ఇంజనీర్లు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని , భారీ వర్షాల వల్ల చెరువులు , కుంటలకు గట్లు బలహీనంగా ఉన్న చోట గండ్లు పడితే వెంటనే వాటిని పూడ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. నీటివనరుల రిపేర్లకోసం ఇంజనీర్లు తమకు ఉన్న ఆర్ధిక అధికారాలను వినియోగించుకోవాలన్నారు. నీటిపారుదలకు సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే ప్రజలు వెంటనే కంట్రోల రూం నంబర్ 04023390794కు ఫోన్ చేయాని కోరారు. గులాబ్ తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షాల నేపధ్యంలో రాష్ట్రంలో ఇప్పటివరకూ నీటిపారుదల రంగానికి సంబంధించిన పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఎక్కడా ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని పలు జిల్లాల నుంచి ఇంజనీర్లు రజత్ కుమార్‌కు వివరించారు. కొన్ని చోట్ల చెరువులకు పడ్డ గండ్లను వెంటనే పూడ్పించామని తెలిపారు.

పరిరక్షణకు 15 ప్రత్యేక బృందాలు:

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు , కుంటలను పరిరక్షించేందుకు సీనియర్ ఇంజనీర్ల నేతృత్వంలో 15ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తూ రజత్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలో మొత్తం 185 చెరువులు ,కుంటల పరిరక్షణ కోసం ఈ బృందాలను ఏర్పాటు చేశారు. వర్షాలకు దెబ్బతిన్న చెరువులు , కుంటల పరిస్థితిని అధ్యయనం చేయడంతోపాటు తీసుకోవాల్సిన చర్యలకోసం ఈ బృందాలను ఏర్పాటు చేశారు.

ఈ ప్రత్యేక బృందాలు తమకు కేటాయించిన పరిధిలోని చెరువులు, కుంటలను పరిశీలించి రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక బృందాల్లో ఎస్‌ఇ స్థాయిలో ఉన్న అధికారులను నిమమించారు. వీరిలో ఎ మురళీధర్, రంగారెడ్డి, ప్రమీల, పి.వి.నాగేందర్ , వి.శ్రీనివాస్ , విద్యాసాగర్ , హైదర్ ఖాన్, ఎన్ .సంజీవ్ , సి.శ్రీనివాస్ . హెచ్ . బసవరాజ్ , పివిఏ ప్రసాద్ , పి.రామశ్రీనివాస్, బి.రాజమ్మ.ఎస్ మురళీకృష్ణ, ఎంఎస్‌ఎన్ రెడ్డిలను నియమిస్తూ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News