Monday, January 20, 2025

ఆలేరు ఎంఎల్‌ఎ గొంగిడి సునీతకు హైకోర్టు షాక్.. రూ.10 వేల జరిమానా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆలేరు ఎంఎల్‌ఎ గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు చూపకుండా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని పది వేల రూపాయల జరిమానా విధించింది. ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. అయితే గతంలో ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు చూపించకుండా, తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆమెపై పిటిషన్ దాఖలు అయింది.

ఈక్రమంలో హైకోర్టులో ఈ అంశం విచారణకు రాగా 2018కి చెందిన కేసులో ఇప్పటి వరకూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయక పోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే గొంగిడి సునీతకు 10 వేల రూపాయల జరిమానాను న్యాయస్థానం విధించింది. అక్టోబర్ 3వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News