- Advertisement -
బెంగళూరు : అమెజాన్ వర్చువల్ అసిస్టెంట్ అలెక్సా భారతదేశంలో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. లక్షలాది మంది ఎకో డివైజస్‌ను కొనుగోలు చేస్తున్నారని అమెజాన్ వెల్లడించింది. వినియోగదారులు ఇంగ్లీష్, హిందీ భాషలలో తమ అభ్యర్థనలను సంగీతం, కథలు, జోకులు, న్యూస్, సమాచారం, వంటకాలు, అలారం, స్మార్ట్ హోమ్ కంట్రోల్, బిల్ చెల్లింపులు, మరెన్నో అభ్యర్థనలు చేస్తున్నారు. అమెజాన్ కొత్త మేల్ వాయిస్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఫిమేల్, మేల్ వాయిస్ రెండింటిని భారతీయులు వినియోగించుకోవచ్చు.
- Advertisement -