Wednesday, December 4, 2024

ఆర్‌ఆర్‌ఆర్‌లో తెలుగు పలుకులు

- Advertisement -
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, – మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ దక్షిణాదిలోకి అడుగుపెడుతోంది. చరణ్‌కు జోడీగా సీత పాత్రలో ఆమె కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన అలియా ఫస్ట్ లుక్ విశేష స్పందన తెచ్చుకుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కోసం అమ్మడు బాగా కష్టపడుతోంది. ముఖ్యంగా టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన అలియా.. ‘ఆర్.ఆర్.ఆర్’ తెలుగు వర్షన్‌లో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోనుందని టాక్ వచ్చింది. అయితే తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్ర బృందం విడుదల చేసిన ఓ వీడియోతో అలియా భట్ తెలుగు డైలాగ్స్ చెప్పనుందని అర్థమవుతోంది. కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులను వివరిస్తూ రాజమౌళి అండ్ టీమ్ ఓ వీడియో ద్వారా ప్రజలకు జాగ్రత్తలు తెలియజేశారు.

అందరు సెలబ్రిటీల మాదిరిగా సందేశం ఇవ్వకుండా.. అందరూ మాట్లాడుకునేలా మెసేజ్ ఇచ్చాడు జక్కన్న. ఇందులో ఎన్టీఆర్,- చరణ్ , అజయ్ దేవగణ్, – అలియాభట్, – రాజమౌళి కలిసి వివిధ భాషల్లో మాట్లాడి సందేశమిచ్చారు. అలియా తెలుగులో, కన్నడలో ఎన్టీఆర్, తమిళ్‌లో చరణ్, మలయాళంలో రాజమౌళి, అజయ్ దేవగణ్ హిందీలో సందేశం ఇచ్చారు. దీంతో ఇప్పుడు అలియా పలికిన తెలుగు పలుకులు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి. “అందరికీ నమస్కారం.. కరోనా సెకండ్ వేవ్ తో దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మాస్క్ పెట్టుకుందాం.. వ్యాక్సిన్ వేయించుకుందాం.. మన కోసం” అంటూ ముంబయ్ బ్యూటీ అలియా భట్ అచ్చ తెలుగులో అందంగా తన సందేశాన్ని వినిపించడం అందరినీ ఆకట్టుకుంది. అదే సమయంలో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోనుందని తెలిసిపోయింది. మరి అమ్మడు ఈ సినిమాలో తెలుగు పలుకులు ఎంత ముద్దుగా పలుకుతుందో చూడాలి. ఇకపోతే ఈ వీడియో ద్వారా తారక్, చరణ్ కూడా ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పనున్నారని అర్థమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News