బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆలియా భట్.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. తొలి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తో మంచి సక్సెస్ అందుకున్న ఆమె.. ఆ తర్వాత వరుస హిట్లతో దూసుకుంది. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించిన ఆలియా ప్రపంచవ్యాప్తంగా నటిగా మంచి పేరు తెచ్చుకుంది.
తాజాగా ఆలియా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఆలియాకు సోషల్‌మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. ఒక ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఈ సుందరికి 8 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. తాజా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన హీరోయిన్ల జాబితాలో ఆలియా రెండో స్థానంలో నిలిచింది. జెన్నిఫర్ లోపెజ్ వంటి వారిని వెనక్కి నెట్టి ఆమె ఈ స్థానాన్ని దక్కించుకుంది. దీంతో అభిమానులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.
ఇక ఆలియా సినిమాల విషయానికిస్తే.. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ పోయిన ఆమె.. ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తోంది. చివరిసారిగా ఆమె నటించిన ‘జిగ్రా’. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాగా, ఆలియా భట్ ప్రభాస్-హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ఫౌజీ’ సినిమాలో, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమాలో కూడా ఆమె నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.