Sunday, December 22, 2024

ఘనంగా నిశ్చితార్థం, మెహందీ వేడుక

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్‌ల వివాహం గురువారం మధ్యాహ్నం జరుగనుంది. ఈ నేపథ్యంలో వీరి నిశ్చితార్థం, మెహందీ ఫంక్షన్ బుధవారం ఘనంగా జరిగింది. రణబీర్ కపూర్ బాంద్రా నివాసం ‘వాస్తు’ లో ముందుగా వినాయకుడి పూజ చేశారు. అనంతరం బుధవారం సాయంత్రం నిశ్చితార్థం, మెహందీ ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్‌కు రణబీర్ కుటుంబ సభ్యులు కరిష్మా కపూర్, నీతూ కపూర్, రిద్దిమా కపూర్, కరీనా కపూర్, అదర్ జైన్, అర్మాన్ జైన్ తదితరులు హాజరయ్యారు. పెళ్లికి ముందు రణ్‌బీర్, అలియాలకు బంగారు కానుక అందింది. సూరత్‌కు చెందిన బంగారు నగల వ్యాపారి ఈ జంటకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్‌ను పంపించాడు. బంగారు పూతతో కూడిన బోకేను బహుమతిగా అందించాడు. ఇక రణబీర్, అలియాల వివాహం గురువారం మధ్యాహ్నం సంప్రదాయబద్ధంగా జరుగనుంది. వీరి పెళ్లి సందర్భంగా ముంబయ్‌లోని కపూర్ కుటుంబానికి చెందిన ఆర్కే స్టూడియో, వాస్తు అపార్ట్‌మెంట్, కృష్ణరాజ్ బంగ్లాను వివిధ అలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News